అదితి గోవిత్రికర్ బాలీవుడ్ నటి. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆమె గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టి అందం, అభినయంతో ఆకట్టుకుంది. 1997లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. డాక్టర్ వృత్తిలో కొసాగుతూ మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. ఆ సమయంలో సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే ఆమె తన సీనియర్ ముఫ్ఫాజల్‌ని ప్రేమించింది. వీరిద్దరూ కొంతకాలం సహజీవనం చేశారు.
ఆ తర్వాత పెద్దలని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. మతపరమైన కారణాల వల్ల అదితి కుటుంబ సభ్యులు ముఫ్ఫాజల్‌తో పెళ్ళికి అంగీకరించలేదు. అయినప్పటికీ ముఫ్ఫాజల్ ని 1998లో పెళ్లి చేసుకుంది. అయితే పిల్లలు పుట్టాక వీరి దాంపత్య జీవితంలో విభేదాలు మొదలయ్యాయి. దాంతో భర్తకు విడాకులు ఇవ్వడంతో ఆయన ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. భర్త కోసం తాను ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ వైవాహిక జీవితం కాపాడుకోలేక కుమిలిపోయింది.
ఇటీవల తన విడాకుల గురించి మాట్లాడుతూ మరోసారి ఎమోషన్ అయ్యింది. “నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద పొరపాటు వివాహా బంధాన్ని కాపాడులేకపోవడం. నాకు గెలవడం ఇష్టం. భర్త నుంచి విడిపోవడాన్ని ఎంతో బాధించింది. విడాకులు నన్ను మానసిక క్షోభకు గురిచేశాయి” అని చెప్పింది. ఆ తర్వాత పిల్లల కోసం మనో ధైర్యం తెచ్చుకుని పిల్లలను చూసుకుంటూ.. డాక్టర్ వృత్తిని కొనసాగిస్తుంది. 2001లోనే మొదటి అదితి ‘మిసెస్ వరల్డ్’ టైటిల్ గెలుచుకోవడం విశేషం.