calender_icon.png 18 March, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

సీఎం హోదాలో ఆ భాష తగదు

18-03-2025 12:00:00 AM

  • ప్రభుత్వ కార్యక్రమంలో కేసీఆర్‌పై దూషణలు సిగ్గుచేటు
  • బీఆర్‌ఎస్ నేత ప్రదీప్‌రెడ్డి

జనగామ, మార్చి 17(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన హోదాను మరిచి కేసీఆర్‌ను అసభ్య పదజాలంతో దూషించడం తన హోదాకు తగదని బీఆర్‌ఎస్ జనగామ జిల్లా నేత అల్లం ప్రదీప్‌రెడ్డి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ప్రభు త్వ అధికారిక కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడకుండా కేవలం బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

సోమవా రం ఆయన జనగామలో విలేకరులతో మాట్లాడారు. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న భాష తెలంగాణ సమాజం తలదించుకునేలా ఉందన్నారు. 14 నెలల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని, అందుకే అధికారిక కార్యక్రమాల్లోనూ రేవంత్‌రెడ్డి నిత్యం కేసీఆర్‌పైనే నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజలకు విరక్తి పుట్టిందన్నారు.

సీఎం ఫోకస్ రాష్ట్ర అభివృద్ధిపై కాకుండా బీఆర్‌ఎస్‌పైనే ఉందని ఎద్దేవా చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ సభలో కొత్తగా ఏమైనా వరాలు కురిపిస్తారని ప్రజలు ఆశించారని, కానీ ఆయన ప్రసంగమంతా కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడానికే సరిపోయిందన్నారు.

ఇప్పుడున్న కరువు పరిస్థితులను చూసి ప్రజలు మరోసారి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, అందుకే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్‌తో పబ్బం గడుపుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో రేవంత్‌రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రదీప్‌రెడ్డి హెచ్చరించారు.