07-04-2025 12:00:00 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాం తి): కంచె గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ లో గల 400 ఎకరాల భూమిని అమ్మె ప్రభుత్వ యోచనను తక్షణమే విరమించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య క్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. లేని పక్షంలో విద్యార్థుల ఆగ్రహాని కి గురికాక తప్పదని, భూముల అమ్మకాలకు పాల్పడితే సహించేలేదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ మేరకు ఆదివా రం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కంచె గచ్చిబౌలి భూమి విషయంలో సీఎం రేవం త్ రెడ్డి వ్యవహరించిన తీరు బాగాలేదన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూములను ప్రేవేట్ వ్యక్తులకు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. 400 ఎకరాల భూమి వేలం అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని అన్నా రు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండే యూనివర్సిటీని బుల్డోజర్లతో యుద్ద వాతావరణం నెలకొల్పారని మండిపడ్డారు.
ప్రభు త్వానికి ఆదాయ వనరులు సమకూర్చుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయన్నా యని, కానీ జీవవైవిధ్యాన్ని నాశనం చేసేలా ప్రకృతిని ధ్వంసం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్ లను పరిగణలోకి తీసుకుని, ఆ భూమిని యూనివర్సిటీకి అప్పగించాలన్నారు.
ఎస్సీ, ఎస్, బిసి వర్గాలు చదువుకోకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం భూముల దందాలను ఆపాలని అన్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖను గుప్పిట్లో పెట్టుకుని ఇస్తారాజ్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు యూనివర్సిటీ భూములను కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు.
కొనుగోలు చేసి ఇబ్బందులకు గురికా వద్దన్నారు. యూనివర్సిటీలో పోలీస్ క్యాంపులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ భూముల విషయమై యూనివర్సిటీ విద్యార్థులు, యువత, ఆయా పార్టీల నేతల తో చర్చలు జరిపి దీనిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమావే శంలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు వెంకటేష్ ముదిరాజ్, మణికంఠ, సి. రాజేందర్, జి. అనంతయ్య, ఓయూ జేఏసీ నేత రాజు, లింగస్వామి, రాందేవ్ మోడీ, బాలస్వామి, ప్రభాకర్, విద్యార్థి సంఘాల నాయ కులు తదితరులు పాల్గొన్నారు.