హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పౌరాణికం, జానపదం, చారిత్రకం.. ఇలా జానర్ ఏదైనా బాలయ్యకు కొట్టిన పిండి. ఆనాటి ‘తాతమ్మ కల’ నుంచి భగవంత్ కేసరి వరకు ఎన్నో సినిమాలతో అలరించారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో సీనియర్ హీరోయిన్స్ నుండి ఈ తరం హీరోయిన్స్ వరకు ఎంతోమంది నటించారు. కానీ అతిలోక సుందరి శ్రీదేవితో మాత్రం ఆయన నటించలేదు. ఇదే విషయమై బాలకృష్ణ పలు సందర్భాల్లో ఇలా చెప్పారు.
“సినిమాల్లో ఆర్టిస్టుల ఎంపిక చాలా ముఖ్యం. శ్రీదేవి లాంటి గొప్పవారిని సాదాసీదా సినిమాలో నటిస్తే బాగుండదు. ఒకటి రెండు సినిమాల్లో శ్రీదేవిని పెట్టాలని చూశారు. కానీ నేనే వద్దని చెప్పా. శ్రీదేవి స్థాయి వేరు. ఆమెతో సినిమా చేయాలంటే కథ అద్భుతంగా ఉండాలి. ఏదో ఆమెను పెట్టి సినిమా చేసినట్టు ఉండకూడదు” అని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. అయితే బాలయ్య ఓ నటుడిగా కెరీర్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవలనే హైదరాబాద్‌లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరిగాయి. ఈ ఈవెంట్ కు హాజరైన టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవితోపాటు ఎంతోమంది స్టార్లు ఈ వేడుకకు హాజరై తామంతా ఒక్కటే అని చాటిచెప్పారు.