calender_icon.png 22 January, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందుకే మట్టి తిన్న

03-07-2024 12:52:13 AM

బ్రిడ్జ్‌టౌన్: టీ20 ప్రపంచకప్ విజయానుభూతి క్షణాల నుంచి ఇప్పట్లో బయటికి రాలేనని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. పొట్టి ప్రపంచకప్ గెలిచిన అనంతరం  హిట్‌మ్యాన్ బార్బడోస్ బీచ్ ఒడ్డున సంప్రదాయ ఫోటో షూట్‌లో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌తో ఫోటోలకు ఫోజులిచ్చిన రోహిత్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘ఈ విజయం నాకు ప్రత్యేకం.

ప్రపంచకప్ గెలిచిన ప్రతీ మూమెంట్, గెలిచిన ప్రతీ క్షణాన్ని మిస్సవ్వకుండా ఆస్వాదిస్తున్నా.  బార్బడోస్ పిచ్‌పై ఉన్న మట్టిని నోటిలో వేసుకోవడం యాదృశ్చికంగా జరిగిపోయింది. ఇందులో స్క్రిప్ట్ ఏమీ లేదు. ఆ సమయంలో అలా జరిగిపోయింది. ఎందుకంటే ఆ పిచ్‌పై మనం ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ గెలిచాం. దాన్ని నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే మట్టి నోట్లో వేసుకున్నా. బార్బడోస్ మైదానాన్ని, పిచ్‌ను జీవితాంతం గుర్తుంచుకుంటా’ అని రోహిత్ వెల్లడించాడు.