చాలామంది అమ్మాయిలు ఆర్టిఫిషియల్ ఆభరణాలను ధరించడానికి ఇష్టపడతారు. కానీ ఎక్కువసేపు ధరించడం వల్ల దాని రంగు నల్లగా మారుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. కృత్రిమ ఆభరణాలు మెరిపించడానికి బేకింగ్ సోడా, నీటిని ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా తీసుకొని, దానికి కొంచెం నీరు వేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పాత టూత్ బ్రష్ లేదా మెత్తని గుడ్డ సహాయంతో ఈ పేస్టును అప్లై చేసి, ఆభరణాలపై సున్నితంగా రుద్దండి.
కొంత సమయం తర్వాత ఆభరణాలను శుభ్రమైన నీటితో కడగాలి. వెనిగర్ కూడా వాడొచ్చు. అంతే కాదు.. పాత టూత్ బ్రష్ కొద్దిగా టూత్ ఫేస్ట్ రాసి ఆభరణాలపై సున్నితంగా రుద్దండి. కొంత సమయం తర్వాత ఆభరణాలను శుభ్రంగా కడిగితే జిగేల్‌మంటూ మెరిసిపోతాయి. మీరు డిష్ వాషింగ్ లిక్విడ్‌ను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు డిష్ వాష్ లిక్విడ్లో మెత్తని గుడ్డను ముంచి, ఆభరణాలపై తేలికగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఆభరణాల నలుపు పోయి కొత్తదనం వస్తుంది.