calender_icon.png 16 January, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్రో ధరలు తగ్గేందుకు అదే మార్గం!

27-07-2024 05:08:35 AM

రాష్ట్రాల మీదికి తోసేసిన నిర్మలమ్మ

న్యూఢిల్లీ, జూలై 26: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటే వాటిని జీఎస్టీ పరిధిలోకి తేవాలని, అందుకు రాష్ట్రాలన్నీ ఒప్పుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇవి ప్రస్తుతం వ్యాట్ పరిధిలో ఉన్నాయి. ఆర్థికమంత్రి శుక్రవారం ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పెట్రో ధరలు తగ్గించే అవకాశం ఉన్నదా? అని అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘వాళ్లు (రాష్ట్రాలు) ఒక రేటు నిర్ధారించుకొని పెట్రోలియంను జీఎస్టీలోకి తేవాలని ఏకాభిప్రాయానికి వస్తే.. మేం వెంటనే దానిని అమలు చేస్తాం. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలోకి ఎలా తేవాలన్న నిబంధనలను ఇప్పటికే రూపొందించాం. దీనిపై జీఎస్టీ కౌన్సిల్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది’ అని వెల్లడించారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌తోపాటు రాష్ట్రాలు తమ సొంత పన్నులు కూడా విధిస్తున్నాయి. దీంతో మొత్తంగా ఈ ఉత్పత్తులపై పన్నులు 60 శాతానికి పెరిగాయి. వీటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తే పన్నులు 28 శాతానికి తగ్గుతాయి.