కేంద్ర బడ్జెట్ కాదు ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం
జగిత్యాల, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘కేంద్ర బడ్జెట్ కాదు.. అది కేవలం బీహార్ రాష్ర్ట బడ్జెట్’ అని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మె ల్యే అడ్లూరి లక్ష్మణ్’కుమార్ విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవ న్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డితో కలిసి అడ్లూరి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
వికసిత భారత్ అంటూ ఊదరగొడుతూ నరేంద్ర మోడీ 10 ఏళ్లు ప్రధానిగా 2015 మార్చ్1 బడ్జెట్ నాటికి దేశ అప్పు 62 లక్షల కోట్లు ఉండగా, పదేళ్లలో ఎన్డీఏ సాధించిన ప్రగతి 1 లక్షా 80 వేల కోట్ల అప్పు అని ఎద్దేవా చేశారు. శని వారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, బీహార్ రాష్ర్ట బడ్జెట్’గా కనపడుతోందనీ దేశ జీడీపీలో 5 శాతం సమకూర్చుతున్న తెలం గాణకు నిధుల కేటాయింపుల్లో వివక్షతో మొండి చేయి చూపారన్నారు.
రాష్ర్ట విభజ న హామీలు బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐఐఎం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి కీలక అంశాలపై ఈ బడ్జెట్లో ఉసే లేదన్నారు. తెలంగాణ ప్రజల హక్కులు కాపాడేందుకు రాజకీ యాలకు అతీతంగా సీఎం రేవంత్’రెడ్డి కేంద్రంతో సన్నిహితంగా ఉంటూ రాష్ట్రానికి నిధుల సాధన కోసం కషి చేస్తున్నా, బడ్జెట్లో తెలంగాణకు మొండి చెయ్యి చూపారన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య సఖ్యత లేకపోవ డంతో పదేళ్లు తెలంగాణ ప్రజలు తమ హక్కులు కోల్పోయారన్నారు.
రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, మెట్రో రైలు, మూసి పునరుద్ధరణ పథకం, ప్రాజెక్టుల కోసం 1 లక్ష 63 వేల నిధుల కోసం ప్రతిపాదనలు పంపితే ఒక్క రూపాయి కూడా కేటాయించ కపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసుకున్నా బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం శోచనీయమ న్నారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీ యహోదా కల్పించకపోవడంతో రాష్ర్టం అప్పుల ఊబిలో కూరుకు పోయిందన్నారు.
బడ్జెట్లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించ కపోవడంతో దేశంలో తెలంగాణ రాష్ర్టం ఉన్నదనే కనీస ఆలోచన అయినా కేంద్రానికి ఉన్నదా? అనే అనుమానం వస్తుందని ఆవే దన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలకు బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన కేంద్రం, తెలంగా ణను విస్మరించడం వివక్షకు పరాకాష్టగా అభివర్ణించారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపుల్లో వివక్షపై జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 3 న నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటిం చారు. జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నా యకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలి రావాలని విప్ అడ్లూరి లక్ష్మణ్’కుమార్ పిలుపునిచ్చారు.