పారిస్: రాబోయే ఒలింపిక్స్‌లో భారత్ నుంచి పాల్గొనబోయే అథ్లెట్ల సంఖ్యను పెంచడమే తమ ముందున్న లక్ష్యం అని భారత ఒలింపిక్ చీఫ్ దే మిషన్ గగన్ నారంగ్ అన్నాడు. ఆయన మాట్లాడుతూ... ‘పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారిని నేను అభినందిస్తున్నా. మరిన్ని పతకాలు సాధిస్తే బాగుండని నాకు అనిపించింది. చాలా ఈవెంట్లలో చివర్లో పతకాలు చేజారిపోయాయి. ఈ విషయాల నుంచి మేము మరింత నేర్చుకుంటాం. మరింత మెరుగైన ప్రదర్శన ఎలా చేయొచ్చో చర్చిస్తాం’ అని నారంగ్ తెలిపారు.