calender_icon.png 26 October, 2024 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అది నిజం కాదు..

16-07-2024 12:10:00 AM

కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ రూమర్స్‌కు ఆమె భర్త, బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ పుల్‌స్టాప్ పెట్టేశారు. విక్కీ కౌశల్ డిమ్రి ప్రధా న పాత్రల్లో నటించిన ‘బ్యాడ్‌న్యూజ్’ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో విక్కీ కౌశల్ విలేకరులు కత్రినా ప్రెగ్నెన్సీ న్యూస్‌పై వివరణ కోరారు. దీనికి కౌశల్ సమాధానమిస్తూ.. “ఆమె రాకతో నా జీవి తం గుడ్‌న్యూస్ ఏదైనా ఉంటే సంతోషంగా మీతో పంచుకుంటాం. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ప్రచారం లో వాస్తవం లేదు. ప్రస్తుతానికి ‘బ్యాడ్‌న్యూజ్’ ఎంజాయ్ చేయండి. సమ యం వచ్చినప్పుడు తప్పకుండా గుడ్‌న్యూస్ షేర్ చేసుకుంటాం” అని చెప్పారు. మరోవైపు ‘బ్యాడ్‌న్యూజ్’ సినిమా పాటలు కుర్రకారుకు మత్తెక్కిస్తుండగా.. మరో కొత్త పాటను మేక ర్స్ ఆదివారం విడుదల చేశారు. ఇద్ద రు హీరోలతో ‘మేరే మెహబూబ్.. మేరే సనమ్...’ అంటూ హీరోయిన్ త్రిప్తి సాగించే సరదా సల్లాపాలు ఈ పాటలో చూడొచ్చు.