ఎంత కష్టపడుతున్నా హీరోయిన్లకు పెద్దగా రెమ్యూనరేషన్ ఇవ్వరంటూ గగ్గోలు పెట్టే ముద్దుగుమ్మలను చూశాం కానీ అసిస్టెంట్ డైరెక్టర్ల గురించి ఆలోచించే హీరోయిన్లు దాదాపు ఎవరూ ఉండరు. అయితే సాయి పల్లవి ముందే చెప్పింది కదా.. సింగిల్ పీస్ అని.. అందుకేనేమో ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ల కష్టాలను సైతం చూడగలుగు తున్నారు. సహాయ దర్శకులకు చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని.. కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వడం లేదంటూ ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఆవేదన వ్యక్తం చేశారు.
బాలీవుడ్‌తో పోలిస్తే టాలీవుడ్లో పని చేసే అసిస్టెంట్ డైరెక్టర్లకు రెమ్యూనరేషన్ చాలా తక్కువన్నారు. బాలీవుడ్లో ఒక చిత్రానికి పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ వెంటనే మరో సినిమా చేస్తున్నారని కానీ దక్షిణాదిలో అలాంటి పరిస్థితి లేదన్నారు. ఇక్కడ కూడా వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తే బాగుంటుందని సాయి పల్లవి అభిప్రాయపడ్డారు. ప్రతి విషయంలోనూ సాయి పల్లవి ఇతర కథానాయికలతో పోలిస్తే చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు.
ఒకవైపు సినిమాలు.. మరోవైపు యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదించే హీరోయిన్లే అంతా కానీ సాయిపల్లవి మాత్రం కోట్లు ఇచ్చినా యాడ్స్ చేయబోనని తెగేసి చెప్పారు. అంతేనా? మేకప్‌కు ప్రాధాన్యత ఇవ్వరు.. స్కిన్ షోలకు చాలా దూరం.. మొత్తానికి సాయిపల్లవి చాలా ప్రత్యేకం. ఇటీవల సాయిపల్లవి అమరన్‌తో మంచి సక్సెస్ అందుకున్నారు. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ప్రస్తుతం తండేల్ చిత్రంలో నటిస్తున్నారు.