calender_icon.png 6 November, 2024 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అది స్వతంత్రత కాదు

06-11-2024 01:23:38 AM

న్యాయవ్యవస్థపై

సీజేఐ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, నవంబర్ 5: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే ఎల్లప్పుడూ ప్రభుత్వానికి  వ్యతిరేకంగా నిర్ణ యం తీసుకోవడం కాదని, కేసుల విషయంలో నిర్ణయాలు తీసుకునే సమయంలో న్యాయమూర్తులను విశ్వసించాలని ప్రజలను కోరారు. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని తీర్పు ఇచ్చినప్పుడు తనను స్వతంత్రుడిగా పేర్కొన్నారని, అదే ప్రభుత్వనికి సానుకూలంగా తీర్పు చెప్పినప్పుడు విమర్శించారని గుర్తుచేశారు. కానీ తన దృష్టిలో అది స్వతంత్రత కాదన్నారు. కొందరు ఎలక్ట్రానిక్ మీడియాను అడ్డం పెట్టుకుని తమకు అనుకూలంగా తీర్పులు వచ్చే లా కోర్టులపై ఒత్తిడి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉందనే దానితో సంబంధం లేకుండా సమతుల్యత పాటిస్తున్నామా?  లేదా అన్నది చూడాలన్నారు.