calender_icon.png 20 November, 2024 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అది కాంగ్రెస్ మార్క్ మోసం

21-07-2024 03:00:00 AM

  1. రేషన్ కార్డుల పేరిట మరోమోసం 
  2. కార్డుంటేనే రుణమాఫీ చేస్తున్నరు
  3. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 20(విజయక్రాంతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు రైతాంగాన్ని మరోమారు మోసం చేసిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రైతు పట్టాదార్ పాస్ బుక్కు ఆధారంగానే రుణ మాఫీ అని చెప్పి ఇప్పుడు మాత్రం రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండానే కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలు చేసుకుంటున్నారని.. రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు అడ్డగోలు ఆంక్షలు పెడతామంటే కుదరని స్పష్టం చేశారు.

కొంత మందికే రుణమాఫీ చేసి మిగతా రైతులకు ఆంక్షలు పెట్టి గతంలో కేసీఆర్ సర్కారు చేసినట్లే చేస్తామంటే కుదరని హెచ్చరించారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో చాలా మంది రైతులకు రుణమాఫీ కావట్లేదన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ రైతులందరికీ వర్తింపచేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం ఈ సీజన్‌లో ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని.. అసెంబ్లీలో చర్చించకుండా రుణమాఫీని చేశారు కదా మరి రైతు భరోసా గురించి అసెంబ్లీలో చర్చ దేనికని ప్రశ్నించారు.