calender_icon.png 15 January, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ జ్యోతి ఆరనిది

25-07-2024 12:57:46 AM

విశ్వక్రీడల్లో ఒలింపిక్ టార్చ్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ఒలింపిక్ ఉద్యమానికి ఇది సూచిక. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో మొదటిసారి టార్చ్ రిలేను నిర్వహించారు. మొద ట ఒక కర్రకు గుడ్డను చుట్టి దీపంగా వెలిగించేవారు. కాలక్రమేణా ఒలింపిక్ టార్చ్ తయారీలో చాలా మా ర్పులు చోటు చేసుకున్నాయి. ఇక ఒలింపిక్స్‌కు పుట్టినిల్లు అయిన ఏథెన్స్ సమీపంలోని ఒలింపియాలో సూర్యకిరణాల ద్వారా ఒలింపిక్ జ్యోతిని వెలిగించడం ప్రతి ఒలింపిక్స్‌కు కొన్ని నెలల ముందు జరిగే ప్రక్రియ. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌కు సంబంధించి 10వేల మంది టార్చ్ బేరర్లతో 400 నగరాల గుండా జ్యోతి ప్రయాణించింది.