బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ ప్రేక్షకాదరణను చూరగొంటున్న భారతీయ అందాల తార ప్రియాంక చోప్రా. హాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటూ అక్కడ బిజీగా ఉన్న ఈమె భారతీయ సినిమా గురించి గొప్పగా మాట్లాడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మరికొన్ని ఆసక్తికర విషయాలనూ పంచుకుంది. ముఖ్యంగా ఓటీటీ వర్సెస్ థియేటర్ చర్చపై మాట్లాడింది ప్రియాంక.
‘పెరుగుతున్న సాంకేతికత సినిమా పురోగతికి ఉపయోగపడుతోంది. త్రీడీ, ఐమాక్స్‌లలో కొత్త ఆవిష్కరణ వస్తున్నాయి. ఇవి ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పెరగడానికి దోహదపడుతున్నాయి. ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అనేది 24 గంటల పాటు ఎన్నో విధాలుగా అందుబాటులో ఉంటోందిప్పుడు. ఓటీటీలు, థియేటర్లు.. రెండూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి.
అయితే బిగ్ స్క్రీన్‌పై సినిమా చూడటం అనేది ఎప్పుడూ ప్రత్యేకమే! చీకటిగా ఉండే ప్రదేశంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతోపాటు ఎందరో పరిచయం లేని వ్యక్తుల మధ్య కూర్చొని చూసే సినిమా అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. అంత పెద్ద స్క్రీన్, ఆ సౌండ్, థియేటర్ వాతావరణం.. అవి ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.
అందుకే ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఎన్ని వచ్చినా థియేటర్ అనుభూతి ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. ‘నేను ప్రస్తుతం హాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. అయితే భారతీయ సినిమాలు ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగానే ఉంటాయి. తిరిగి బాలీవుడ్‌కు రావడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాను. త్వరలో ఓ హిందీ చిత్రాన్ని కూడా ప్రకటించబోతున్నాను.