calender_icon.png 23 February, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ డైలాగ్ సెన్సార్ అయ్యింది

23-02-2025 12:34:59 AM

సందీప్ కిషన్, త్రినాథరావు నక్కిన కాంబోలో రూపొందిన చిత్రం ‘మజాకా’.  రాజేశ్ దండా నిర్మించారు. రీతు వర్మ హీరోయిన్. అన్షు, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ విలేకరులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. “మజాకా’ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్.

రావు రమేశ్‌తో నా కెమిస్ట్రీ నేచురల్‌గా వర్క్ అవుట్ అయ్యింది. నా క్యారెక్టర్ పేరు కృష్ణ. నేనూ, నాన్న ఒకే ఇంట్లో బ్యాచిలర్స్‌గా బతుకుతుంటాం. మమ్మల్ని ఎవరూ పండగలకి, పబ్బాలకి పిలవరు. కలిసి తాగి పడిపోయే తండ్రీకొడుకులం. సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు, ఫన్ ఉంటుంది.   నాకు పిరియాడిక్ సినిమాలు ఇష్టం. రాబిన్‌హుడ్ లాంటి సినిమా చేయాలనుంది. 

ఇందులో ఖుషి రిఫరెన్స్ సీన్ ఉంది. నడుం చూసి నాన్న షేక్ అయిపోయి ఉంటే.. ఏమైంది నాన్న అని అడుగుతా. ‘అప్పట్లో పిఠాపురం ఎమ్మెల్యే ఇలాంటివి చూసి ఎంత కంగారు పడ్డారో ఇప్పుడు అర్థమవుతుంది’ అంటారు. అయితే డైలాగ్ సెన్సార్ అయిపొయింది (నవ్వుతూ). రాజేశ్, అనిల్ ఒకరు అన్నయ్య, మరొకరు ఫ్రెండ్‌లా ఉంటారు” అన్నారు.