calender_icon.png 28 April, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ రోజు రాజమౌళి పాస్‌పోర్ట్ లాగేసుకుంటా!

28-04-2025 01:17:05 AM

నాని హీరోగా నటిస్తున్న క్రైమ్‌థ్రిల్లర్ ‘హిట్3: ది థర్డ్‌కేస్’. శైలేశ్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. మే 1న విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజర వగా, ‘హిట్’ ఫ్రాంచైజీ హీరోలు విశ్వక్‌సేన్, అడివి శేష్‌లూ విచ్చే శారు.

రాజమౌళి మాట్లాడుతూ.. “సినిమాకు సం బంధించి ఏదైనా విషయం బయటికి లీక్ అయినప్పుడు చాలా కోపం వస్తుంది. కానీ ఓ ఇంటర్వ్యూలో శైలేశ్ చా లా కూల్‌గా సెటిల్‌గా మాట్లాడిన విధానం నన్ను ఆకట్టుకుంది. తనపై గౌరవం ఏర్పడింది. చాలామంది ఫ్రాంచైజీలు క్రియేట్ చేస్తారు. శైలేశ్‌కున్న ఆలోచనలు ఏడే కావచ్చు. కానీ ‘హిట్’ ఫ్రాంచేజీ అంతకంటే ఎక్కువగా కొనసాగుతుందని నమ్ముతున్నా. నాని ఏ సినిమా చేసిన హిట్ అని తెలుస్తోంది. ఆయన నా నుంచి ముందుకు వెళ్లిపోయాడు. ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నా” అన్నారు.

హీరో నాని మాట్లాడు తూ.. “రాజమౌళితో నాకో సెంటిమెంట్ ఉండేది. మేము ప్రతి కొత్త సినిమానూ ప్రసాద్ ఐమాక్స్‌లో చూసేవాళ్లం. సినిమా రిజల్ట్ ఆయ న్ను అడిగి  తెలుసుకునేవాడ్ని. మే 1న ఆయన (రాజమౌళి)కి ఏ పనులున్నా.. ప్రయాణం చేయాల్సి ఉన్నా సరే.. ఆయన పాస్‌పోర్ట్ నేను లాగేసుకుంటా (నవ్వుతూ). మీరు (రాజమౌళిని ఉద్దేశించి) సినిమా చూసి మళ్లీ ఆ ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నా. సినిమా డిక్షనరీలోకి వెళ్లిపోయిన ఒక పేరు ఎస్‌ఎస్ రాజమౌళి. సినిమాల్లో ఏదైనా ఒక రిఫరెన్స్ పాయింట్ మాట్లాడుకున్నప్పుడు రాజమౌళి సీన్‌లా ఉండాలి అంటాం.

అలాంటి ఒక సీక్వెన్స్ ‘హిట్3’లో ఉంది. సినిమా మీద ఉన్న ప్రేమను ఇంకోసారి గట్టిగా దేశం మొత్తం వినిపించేలాగా చూపిద్దాం.  మీ నాని మీకు ప్రామిస్ చేస్తున్నాడు. నా వెనక రాజమౌళి ఉన్నారు. నా ముందు మీరు న్నారు. మీరంతా చూపిస్తున్న ప్రేమ ఉంది. కడుపులో వేంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంది. కళ్యాణ్ స్టుటైల్‌లో చెప్పాలంటే మనల్ని ఎవడ్రా ఆపేది. బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం” అన్నారు. హీరోయిన్ శ్రీనిధిశెట్టి మాట్లాడుతూ.. “తెలుగులో ఇది నా ఫస్ట్ సినిమా. తెలుగులో డబ్బింగ్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది.

నేను కాలేజ్ డేస్‌లో నాని సినిమాలన్నీ చూశాను. ఆయనతో వర్క్ చేయాలని ఉండేది. ఈ సినిమా ద్వారా అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది” అన్నారు. డైరెక్టర్ శైలేశ్ మాట్లాడుతూ.. ‘ముందుగా పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఈ సినిమా షూటింగ్ సమయంలో డీవోపీ డిపార్ట్‌మెంట్ వర్క్ చేసిన కృష్ణ అనారోగ్యంతో చనిపోయారు.

ఆయనకు సంతాపం తెలిజేస్తున్నా. నానికి సినిమా మీద ఆయనకున్న పాషన్ అద్భుతం. ఈ సినిమా షూటింగ్‌లో ఫైర్ నాని హెయిర్‌కి అంటుకుంది. అయినా ఆయన నెక్స్ట్ షాట్‌కి రెడీ అయిపోయారు. అదేరోజు ఆయన తలకు గాయమైంది. రక్తం కారుతున్నా సీన్స్ అన్నీ ఫినిష్ చేసి హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ తీసుకుని మళ్లీ షూటింగ్‌కు వచ్చేశారు. సినిమా మీద ఆయనకున్న మ్యాడ్ పేషన్ వండర్ ఫుల్. నాని పక్కన ఉంటే చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుం ది” అన్నారు. 

‘మహాభారతం’లో నాని పాత్ర ఫిక్స్: రాజమౌళి 

ఈ ఈవెంట్‌లో మూవీ కాన్సెఫ్ట్‌కు తగ్గట్టుగా యాంకర్ సుమ అతిథులను, చిత్రబృందాన్ని ఇంటరాగేట్ చేశారు. నాని, రామౌళిల ఇంటరాగేషన్‌లో భాగంగా “మీరు తెరకెక్కించనున్న ‘మహాభారతం’లో నాని పాత్ర ఫిక్స్ అయ్యిందంటూ వార్తలొచ్చాయి. నిజమేనా?” అని అడగ్గా..  తప్పకుండా ఆ ప్రాజెక్టలో నాని ఉంటాడనేది ఫిక్స్ అని చెప్పి రాజమౌళి.. క్యారెక్టర్ గురించి ప్రస్తావించలేదు. ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ గురించి ఏదైనా అప్‌డేట్ ఇవ్వమని కోరగా నవ్వి ఊరుకున్నారు.