ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
ముషీరాబాద్, జనవరి 12 : (విజయక్రాంతి): ఈనెల 8న తెలంగాణ సాంస్కృతిక సారధి విడుదల చేసిన సర్క్యూలర్‌ను తీవ్రం గా వ్యతిరేకిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నా రు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అహర్నిశలు కృషిచేసిన గద్దర్ కూతురైన సాంస్కృతిక సార ధి చైర్‌పర్సర్ వెన్నెల గద్దర్ ఇలాంటి సర్క్యూలర్‌ను తీసుకురావడం చాలా బాధాకర మని అన్నారు.
సారధిలో ఉన్న కళాకారులు ప్రైవేట్ బహిరంగ సభ లు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఈ సర్క్యూల ర్ సారాంశమని వివరించారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 7న వేల గొంతులు, లక్షడప్పుల కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసమే ఈ సర్క్యూలర్ తీసుకువచ్చారని ఆరోపించారు.
ఉప ముఖ్యమం త్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశాల మేరకే ఈ సర్క్యూలర్ వచ్చిందని మందకృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. సర్క్యూలర్‌ను వెంటనే రద్దు చేయడంతో పాటు సారధి చైర్‌పర్సన్ తన వైఖరి మార్చుకోవాలని, లేని పక్షంలో ఆమెను తొలగించాలని డిమాండ్ చేయాల్సివస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.