11-04-2025 12:04:09 AM
మంత్రి పొంగులేటి క్లారిటీ
ఖమ్మం, ఏప్రిల్ 10( విజయక్రాంతి ):- రానున్న ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి తాను పోటీ చేయనున్నట్లు చేస్తున్న ప్రచారంపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టత ఇచ్చారు. గురువారం మంత్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన లు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, పాలేరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో తాను మంత్రిగా ఉన్నానని చెప్పారు. తాను కొత్తగూడెం వెళ్తాననే ప్రచారం అబద్ధమని మంత్రి స్పష్టం చేశారు.