ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్. ఇటీవల ఆయన స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్ఠాత్మక పార్డో అల్లా కెరియ రా పురస్కారాన్ని అందుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షారుక్‌కు ‘వరుస పరాజయాల వల్లే సినిమాలకు విరామం వచ్చిందా?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. “జీరో’ మూవీ ఫ్లాప్ అయినందువల్ల నేను సినిమాలకు దూరమవ్వలేదు. కమర్షియల్ చిత్రాలకు కొన్ని పరిమితులు ఉంటాయి.. వాటిని దృష్టిలో ఉంచుకొని చేయాల్సి ఉంటుంది.
నా సినిమాలన్నీ కొత్తగా ఉండాలని భావిస్తా. అన్నింట్లోనూ పాటలు, డ్యాన్సులు, ఫైట్లు, భావోద్వేగాలు తప్పక ఉండాలి. ‘జీరో’, ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’, ‘ఫ్యాన్’.. ఇవన్నీ నాకు ఇష్టమైనవే. ఈ సినిమాలు చేయడం అంత ఈజీ కాదు. కానీ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులనూ అలరించేలా, అర్థమయ్యేలా సరళం గా ఉండాలి. ఉపన్యాసంలా ఉండొద్దు. వీటిల్లో అదే లోపించింది. ఫ్లాప్ కావడానికి బహుషా అవే కారణమై ఉండొచ్చు. అయితే, ఆ సినిమాలు ఫ్లాప్ అయిన కారణంగా నేను విరామం తీసుకోలేదు. అప్పుడు నటించాలనుకోలేదు. నటన సహజంగా ఉంటేనే ఫలితం బాగుంటుంది కదా” అని వివరించారు.