calender_icon.png 24 October, 2024 | 4:59 PM

ఆ అందమైన సాయంత్రం..

20-07-2024 02:37:47 AM

అది హాట్ లుక్ అయినా, ట్రెండీ కాస్ట్యూ మ్స్ అయినా చక్కనమ్మ ఎలా కనిపించినా అందమే! , ఇలా విభిన్న వస్త్రధారణలతో అభిమానులను చూపు తిప్పుకోకుండా చేసే హీరోయిన్లలో మాళవిక మోహనన్ ఒకరు. సోషల్ మీడియా ను వేడెక్కించే అతికొద్ది మంది సెలబ్రిటీల్లో మాళవిక మోహనన్ ముందు వరుసలో ఉం టుంది. ఈ మలబార్ మందారం నెట్టింట కనిపించిందంటే కామెంట్స్, లైక్స్ వరదను తలపిస్తాయి. ఎప్పుడూ ఏదో ఒక కొత్త లుక్‌తో నెటిజన్ల ముందుకు వచ్చే ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరకట్టులో హొయలు పోతూ కెమెరా కళ్లకు చిక్కింది.

అందానికే అసూయ పుట్టేలా ఉన్న ఈ ఫొటోలు ఇప్పుడు నెటిజన్లకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఇంతకీ ఈ ఫొటోల వెనుక విష యం ఏమిటో చెప్పనే లేదు కదూ! 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ప్రారంభోత్సవ విశేషాలు, నామినేషన్ల వివరాలు తెలియజేసేందుకు నిర్వాహకులు ఓ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బెంగళూరు సిటీ వేదికైంది. దీంట్లో మాళవిక కూడా పాల్గొంది. అదిగో ఆ సందర్భంలోనే క్లిక్‌మనిపించిన ఫొటోలనే మాళవిక నెట్టింట వదిలి సెగలు పుట్టిస్తోంది.

‘ఒక అందమైన సాయంత్రం’ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఆ బ్యూటీఫుల్ ఈవినింగ్ నుంచే కుర్రకారు ఆమెతో కలిసి ఊహల లోకంలో విహరిస్తూ డ్యూయెట్లు పాడేసుకుంటున్నారు. ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే.. విక్రమ్ హీరోగా నటిస్తున్న ‘తంగలాన్’లో ఫీ మేల్ రోల్‌లో కనిపించనుంది.