21-03-2025 12:00:00 AM
జనగామ, మార్చి 20(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట తొలి తరం ఉద్యమకారుడు జాటోతు ఠాణునాయక్ అని సేవాలాల్ సేనా జిల్లా అధ్యక్షుడు ధరావత్ శంకర్ నాయక్ అన్నారు. గురువారం ఠానునాయక్ వర్ధంతి సందర్భంగా జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ఆయన చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ మి, భుక్తి, విముక్తి కోసం జరిగిన సాయధ పోరాటంలో ఠానునాయక్ కుటుంబం ప్రధాన పాత్ర పోషించిందన్నారు. సాయుధ పోరాటానికి ముందే లంబాడీల భూ విముక్తి కోసం ఆయన 1945లో భూస్వాములపై తిరుగుబాటు చేశాడన్నారు. ఆ పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంగా మారిందన్నారు.
భూస్వాములపై తిరిగబడినందుకు అప్పటి విస్నూరు దొర, రజాకార్లు ఠానునాయక్ సోదరులు ఐదుగురిని సజీవదహనం చేశారని గుర్తు చేశారు. ఆ తరువాత మొండ్రాయి గ్రామంలో 1950 మార్చి 20న ఠానునాయక్‌కు తుపాకులతో కాల్చి చంపారన్నారు.
ఆయన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని, జిల్లాకు ఆయన పేరును పె ట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోత్ మహేందర్ , జిల్లా ఉపాధ్యక్షుడు భూక్యా రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి దరవత్ రమే ష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.