calender_icon.png 22 April, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌హెచ్‌ఆర్‌సీకి కృతజ్ఞతలు

22-04-2025 02:14:15 AM

  1. లగచర్ల ఘటనలో వాస్తవాలు బయటపెట్టింది
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): లగచర్ల గిరిజన రైతులు, మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదం మోపారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఎక్స్ వేదికగా ఆరోపించారు. హ్యష్‌ట్యాగ్ ఎన్‌ఎచ్‌ఆర్‌సీ, హ్యాష్‌ట్యాగ్ లగచర్ల దారుణాలు, హ్యాష్‌ట్యాగ్ కాంగ్రెస్ ఫెయి ల్ తెలంగాణ పేరుతో ఆయన పోస్టులు పెట్టా రు.

లగచర్ల ఘటనపై స్పందించి, వాస్తవాలు వెలికితీసిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపా రు. అధికారంలో ఉన్నవారు చట్టానికి అతీతులమని భావించే ప్రతిఒక్కరికీ.. ఈ నివేదిక ఒక హెచ్చరికలాంటిదని తెలిపారు. అధికారం దుర్వినియోగం సహించేది లేదన్నారు.

రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన గిరిజన సోదరసోదరీమణులకు గొప్ప ముందడుగు అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు సీఎంతో పాటు హోంమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి లగచర్ల రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.