calender_icon.png 11 February, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్వీప్రసాద్ ఇన్‌స్టిట్యూట్‌కు కృతజ్ఞతలు

10-02-2025 01:36:22 AM

ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ఎల్వీప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు మాజీమంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాజన్న సిరిసిల్లలోని కృష్ణ సింధూర కంటి కేంద్రం నాలుగో వార్షికోత్సవం జరుపుకుంటుందని, దీన్ని సాకారం చేసినందుకు ఎల్‌వీపీఈఈ, హెటిరో ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ జీఎన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నాలుగేళ్లలో 87 వేలకుపైగా ఓపీ సేవలు, ఆరువేల శస్త్రచికిత్సలను అందించిందన్నారు. అదనంగా కేంద్రానికి అనుబంధంగా ఉన్న విజన్ సెంటర్లు 34 వేలకిపైగా కంటి పరీక్షలను అందించాయని, టీమ్ మొత్తానికి తన శుభాకాంక్షలు తెలిపారు.