calender_icon.png 29 April, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

29-04-2025 12:00:00 AM

అవాంతరాలు లేకుండా సభ విజయవంతమైంది

ప్రజల సమస్యలపై బీఆర్‌ఎస్ పోరాటం ఆగదు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిటెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ ఎస్ రజతోత్సవ సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఆయన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ సభను సక్సెస్ చేయడంలో వరంగల్ నేతలు ప్ర త్యేకంగా కృషి చేశారని, హుస్నాబాద్ మా జీ ఎమ్మెల్యే సతీష్‌కు ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు. సభా ప్రాంగణం వద్ద గత నెలరోజులుగా నేతలు, కార్యకర్తలు కృషి చేశారని చెప్పా రు. పక్కా ప్రణాళికతో, ఎలాంటి అవాంతరాలు లేకుండా సభను నిర్వహించామ న్నారు. మంచి కవరేజ్ చేసిన మీడియాకు ధన్యవాదాలు తెలిపా రు.

ఎల్కతుర్తి సభతో బీఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి రాబోతోందన్న విష యం స్పష్టమైందని కేటీఆర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆరే స్వయంగా నేనే ముందుండి పోరాడుతానని చెప్పినందున భవిష్యత్‌లో మరిన్ని ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే తగిన సమ యం ఇచ్చామని, ఇకపై ప్రతీ అంశంపై  వెంటాడుతామన్నారు. ఆ దివారం జరిగిన సభ కేవలం ప్రా రంభం మాత్రమేనని చెప్పారు.

ట్రాఫిక్ నియంత్రణలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం విఫలమైనప్పటికీ లక్షలాది మంది ప్రజలు ముందే సభా ప్రాంగణానికి చేరుకోవడం తెలంగాణ ప్రజల నిబద్ధతకు నిదర్శనమన్నారు. ప్ర భుత్వ వైఫల్యాలను, దోపిడీ చర్యలను మీడియా ద్వారా ఎండగ ట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకుల అరాచకాలు, వారి ప్ర చారాలను ఎక్కడిక్కడ ఎదుర్కొని ప్రజల్లో స్పష్టత తీసుకురావాలని నేతలకు సూచించారు. దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద బహిరంగ సభల్లో రజతోత్సవ సభ నిలిచిపోనున్నద ని కేటీఆర్ తెలిపారు.