calender_icon.png 25 March, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఐటీ మద్రాస్ యూనివర్సిటీ నిర్వాహకులకు కృతజ్ఞతలు..

22-03-2025 08:34:28 PM

న్యూ లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థ కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని భూమేశ్వరరావు..

వైరా,(విజయక్రాంతి):  చెన్నైలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీ మద్రాస్ యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్న వివిధ రకాలైన కోర్సులను విద్యార్థులకు అందించుటకు న్యూ లిటిల్ ఫ్లవర్స్ కళాశాలను ఎంపిక చేసినందుకు ఐఐటి మద్రాస్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ముత్తు విజయన్(IIT Madras University Associate Professor Muthu Vijayan)తో పాటు నిర్వాహకులకు న్యూ లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థ కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని భూమేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐఐటీ మద్రాస్ యూనివర్సిటీ వారు స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్స్ లో భాగంగా విద్యార్థులు భవితకు బంగారు బాటలు వేయుటకు అడ్వాన్సు ప్రోగ్రామ్స్ అయినా డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అర్జిటెక్చర్ అండ్ డిజైన్ వంటి ప్రోగ్రామ్స్ కి సంబంధించిన శిక్షణను కాలేజీ విద్యార్థులకు 8 వారాల శిక్షణను ఇచ్చేందుకు అంగీకార పత్రం ఇచ్చారన్నారు.

8 వారాల శిక్షణ తరగతులతో విద్యార్థులతో సాంకేతికపరమైన నైపుణ్యాలు పెరిగి ఇంజనీరింగ్ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అని పేర్కొన్నారు దేశంలో అత్యున్నత సంస్థల సౌజన్యంతో శిక్షణ పొందటం వైరా ప్రాంత విద్యార్థులకు మంచి అవకాశం అని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కాపా మురళీకృష్ణ కుర్ర సుమన్ లగడపాటి ప్రభాకర్ రావు ప్రిన్సిపాల్స్ పి భువన ప్రసాద్ షాజీ మాథ్యూ, ఏవో సామినేని నరసింహారావు విద్యార్థులు పాల్గొన్నారు.