calender_icon.png 3 December, 2024 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనపై చొరవకు కృతజ్ఞతలు

05-11-2024 01:59:25 AM

సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబుకు ఆర్ కృష్ణయ్య కృతజ్ఞతలు

హైదరాబాద్, నవంబర్ 4 (విజయ క్రాం తి): కులగణనకు కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న చొరవకు కృతజ్ఞతలని మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని, మంత్రి శ్రీధర్‌బాబును విడివిడిగా కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దశాబ్దాలుగా సాధ్యం కానీ కులగణన ప్రక్రియను చేపట్టేందుకు ముందుకురావడం హర్షణీయమని వెల్లడించారు.

ఇందులో భాగంగా డెడికేటెడ్ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భం గా కులగణన సర్వేకు సంబంధించి మంత్రి శ్రీధర్‌బాబుకు ఆర్ కృష్ణయ్య పలు సూచన లు, సలహాలు ఇచ్చినట్టు సమాచారం. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శంకర్ తదితరులు ఉన్నారు.