24-03-2025 08:58:13 PM
జుక్కల్ ఎమ్మెల్యే తోట..
బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం రాష్ట్రంలో మున్సిపాలిటీ లేని నియోజకవర్గం అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలను ప్రకటించిన దాంట్లో జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుందను ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా చలామణి అయిన నాయకులు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడలేదని, దాని ద్వారా నియోజకవర్గం వెనుకబాటుకు గురైందని విమర్శించారు.
ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగడమే తమ ధ్యేయమని అన్నారు. దానిలో భాగంగానే బిచ్కుందని మున్సిపాలిటీగా సోమవారం మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రకటించారు అన్నారు. రాష్ట్రంలోనే వెనుకబడిన నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గమని నియోజకవర్గంలో మొట్ట మొదటి మున్సిపాలిటీగా బిచ్కుందను చేయడం జరిగిందన్నారు. మున్సిపాలిటీ చేస్తూ.. జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ధన్యవాదాలు తెలిపారు.