హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో కులగణన చేపట్టినందుకు ప్రభుత్వానికి, బీసీల రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి అందజేసిన రాష్ట్ర బీసీ కమిషన్‌కు టీజీవో రాష్ట్ర కార్యదర్శి ఏ సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మిలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనవెంట టీజీవో హైదరాబాద్ సంఘం అధ్యక్షుడు ఎంబీ కృష్ణాయాదవ్, సెక్రటరీ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, చంద్రజ్యోతి ఉన్నారు.