calender_icon.png 1 March, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఎన్టీయూసీ ఆర్జీ 2 ఉపాధ్యక్షులుగా నియమించిన రాష్ర్ట మంత్రి శ్రీధర్‌బాబుకు ధన్యవాదాలు

31-01-2025 12:00:00 AM

హైదరాబాద్ మంత్రి నివాసం లో ఆర్జీ 2 ఉపాధ్యక్షుడు శంకర్ నాయక్

రామగుండం జనవరి 30: ఐఎన్టీయూసీ ఆర్జీ-2 ఉపాధ్యక్షుడి తనను నియమించినందుకు రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబుకు 8 కాలనీకి చెందిన బదావత్ శంకర్ నాయక్  రాష్ర్ట ఐటీ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను గురువారం హైదరాబాదు లో మంత్రి నివాసం లో ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలుపారు. అనంతరం మంత్రి ఆశీర్వాదం తీసుకున్నారు. 

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ శంకర్ నాయక్ సుదీర్ఘ కాలం పాటు కార్మిక క్షేత్రంలో కార్మిక నాయకునిగా  నిత్యం కార్మికులకు అందుబాటులో ఉంటూ కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ ఉండాలని మంత్రి శంకర్ నాయక్ కు దిశ నిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో రాష్ర్ట మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఐఎన్ టిసి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ల సహాయ సహకారాలతో కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుంటానని శంకర్ నాయక్ తెలిపారు.