నయనతార తన డాక్యుమెంటరీ అయిన ‘బియాండ్ ది ఫెయిరీ టేల్ ’ విషయమై అడగ్గానే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినందుకు చిరంజీవి, షారుఖ్ ఖాన్‌లకు ధన్యవాదాలు తెలిపారు. వీరితో పాటు తన 20 ఏళ్ల కెరీర్‌లో అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తన డాక్యుమెంటరీ కోసం చిరు, షారుఖ్, రామ్ చరణ్‌లతో పాటు వివిధ ఇండస్ట్రీలకు చెందిన పలువురిని సంప్రదించానని వారు ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదని అన్నారు.
“నేను పని చేసిన ప్రతి సినిమాకు నా జీవితంలో ఓ ప్రత్యేక స్థానముంది. నాకు లెక్కలేనన్ని సంతోషకరమైన అనుభూతులను నా సినీ ప్రయాణం ఇచ్చింది. నేను చేసిన చిత్రాల్లో నా మనసుకు దగ్గరైనవి చాలా ఉన్నాయి. ఆ చిత్రాల జ్ఞాపకాలను, సన్నివేశాలను మా డాక్యుమెంటరీలో చేర్చాలని పలువురు నిర్మాతలను సంప్రదించగా వారంతా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. నాకు అత్యంత విలువైన క్షణాలను అందించిన వారందరికీ ధన్యవాదాలు” అని నయనతార తెలిపారు.
డాక్యుమెంటరీ విషయమై ధనుష్‌తో వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నయనతార తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.