calender_icon.png 20 November, 2024 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంకా ప్రేమిస్తుంటే కృతజ్ఞతలు

27-08-2024 12:00:00 AM

సీనియర్ కథానాయిక సమంత మానవ సంబంధాలపై పాఠాలు చెప్తోంది. ఆధ్యాత్మిక చింతన పట్ల ఆకర్షితురాలైన తర్వాత ప్రేమ, స్నేహం, బంధాల గురించి తరుచూ నాలుగు మంచి మాటలు చెప్తున్న ఈమె తాజాగా తన ఇన్‌స్టాలో అదే విధమైన పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ‘చాలా మంది వ్యక్తులు స్నేహాలు, సంబంధాలను పరస్పరం కొనసాగిస్తారు. వీటిని నేనూ అంగీకరిస్తున్నా. మీరు ప్రేమను పంచుతారు. నేను కూడా తిరిగి ఇస్తా. కానీ, కొన్నేళ్లుగా నేను నేర్చుకున్నది ఏమిటంటే.. మనం ప్రేమను పంచే ఎదుటి వ్యక్తి తిరిగి ఇచ్చే స్థితిలో లేనప్పుడు కూడా ప్రేమను అందజేస్తాం. ఎందుకంటే ప్రేమ అనేది ఓ త్యాగం.

మనకు అవతలి వైపు నుంచి ప్రేమ, ఆప్యాయతలు అందకపోయినా.. ఇప్పటికీ తమ ప్రేమను ధారపోస్తున్న వ్యక్తులకు కృతజ్ఞతలు’ అంటూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది. సమంత భాగమైన ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ విడుదల కావాల్సి ఉంది. అంతేకాకుండా సమంత ఇప్పటికే తన సొంత బ్యానర్‌లో ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని ప్రకటించింది.