calender_icon.png 26 December, 2024 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

థాంక్యూ సీఎం సార్!

02-11-2024 01:13:33 AM

డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపుపై మంత్రి సీతక్క హర్షం l 7 ఏండ్లుగా డైట్, 16 ఏండ్లుగా పెరగని కాస్మోటిక్ చార్జీలు

హైదరాబాద్, నవంబర్ 1 (విజయ క్రాంతి): జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డితోమంత్రి సీతక్క శుక్రవా రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచినందుకు సీఎం కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అనంత రం మీడియాతో మాట్లాడుతూ  రేవంత్‌రెడ్డి సీఎంగా ఉండటం వల్ల విద్యా రంగ సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతున్నా యన్నారు.

విద్యార్థులకు మంచి భవిష్యత్ ను అందించాలనే లక్ష్యంతో సీఎం పనిచేస్తున్నారని, అందుకే సంక్షేమ హాస్టల్, గురు కుల విద్యార్థులకు ఎన్నడూ లేనివిధంగా 40 శాతం డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచారన్నారు. ఏడేండ్లుగా డైట్ చార్జీలు, 16 ఏం డ్లుగా కాస్మోటిక్ చార్జీలు పెరగలేదని    గుర్తుచేశారు. ఇకనుంచి హాస్టల్ విద్యార్థులు అర్ధాకలితో అవస్థలు పడాల్సిన అవసరం లేదన్నారు.

పెరిగిన డైట్ చార్జీలతో విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన బాధ్యత టీచర్లకు, హాస్టల్ సిబ్బందికి ఉంద ని గుర్తు చేశారు. హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తామని సీతక్క సచివాలయంలో విడుదల చేసిన వీడియో ద్వారా పేర్కొన్నారు.   

డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డిని విద్యాశాఖ, బీసీ సంక్షే మ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటే శం, ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పదిరోజుల్లో కొత్త డైట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించినట్లు వారు తెలిపారు. పెంచిన డైట్, కాస్మోటిక్ చార్జీలతో  7,65,705 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.