calender_icon.png 27 December, 2024 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయిపల్లవికి తండేల్ టీమ్ విషెస్

18-07-2024 01:34:38 AM

ఒకే ఏడాది రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న హీరోయిన్‌గా సాయిపల్లవికి అరుదైన ఘనత దక్కింది. 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఆమెను ఉత్తమ నటి పురస్కారం వరించింది. ‘విరాటపర్వం’, ‘గార్గి’ చిత్రాల్లో నటనకు గాను సాయిపల్లవికి తాజా అవార్డులు దక్కగా, ఆమె ఖాతాలోని పురస్కారాల సంఖ్య ఆరుకు చేరింది. ఈ ఆనంద సందర్భాన్ని నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ టీమ్ సెలబ్రెట్ చేసుకుంది. చిత్ర యూనిట్ సాయి పల్లవిని అభినందిస్తూ మూవీ సెట్‌లో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో అల్లు అరవింద్, చందు మొండేటి, టీమ్ పాల్గొన్నారు.