calender_icon.png 12 February, 2025 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండేల్ సక్సెస్ మీట్.. స్పెషల్ అట్రాక్షన్‌గా నాగచైతన్య దంపతులు

12-02-2025 12:49:59 AM

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.70 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు నమోదు చేసిన చిత్రంగా ‘తండేల్’ నిలవనుంది. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదలై మంచి సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగార్జున, నిర్మాత అశ్వనీదత్ హాజరయ్యారు. నాగచైతన్య తన సతీమణి శోభితతో కలిసి హాజరయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, చిత్ర సమర్పకులు అల్లు అరవింద్, చిత్ర నిర్మాత బన్నీవాసు తదితరులు హాజరయ్యారు.

ఈ వేడుకలో నాగ చైతన్య దంపతులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సక్సెస్ మీట్‌కు సాయి పల్లవి హాజరవుతుందని అంతా భావించారు కానీ అనుకోని కారణాలతో ఆమె హాజరు కాలేకపోయారు.