26-03-2025 12:53:34 AM
టేకులపల్లి, మార్చి 25 (విజయక్రాంతి) :అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పా టిల్ వాహనాన్ని టేకులపల్లి మండలం దాసు తండా, రేగుల తండా గ్రామస్తులు మంగళవారం అడ్డుకున్నారు.
మండలంలోని బోడు ప్రాంతంలో వివిధ పంటను పరిశీలించేందుకు వెళ్తుండగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వాహనాన్ని అడ్డుకుని పరిస్థితిని వివరించారు.
రెండు సంవ త్సరాల క్రితం ప్రారంభించిన రోడ్డు పనులు మధ్యలోనే అసంపూర్తిగా వదిలేశారన్నారని ఈ మార్గంలో కోయగూడెం ఓసి నుండి వివిధ ప్రాంతాలకు బొగ్గును లారీలు, టిప్ప ర్ల ద్వారా తరలిస్తున్నారు. దీంతో ఇండ్లలోకి దుమ్ము, ధూళి చేరి అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారితో మాట్లాడుతూ వారం రోజుల్లో తారు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ హామీతో గ్రామస్తులు ఆందోళన విరమించారు