04-04-2025 01:30:41 AM
‘ఝుకేంగా నహీ’ అంటూ ఫైర్
వక్ఫ్ భూమి ఖర్గే కబ్జా చేశాడని ఠాకూర్ ఆరోపణలు
క్షమాపణలు చెప్పాలని ఖర్గే డిమాండ్
ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్న కాంగ్రెస్ అధ్యక్షుడు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం రాజ్యసభలో పుష్ప మూవీ డైలాగ్ చెబుతూ బీజేపీపై ఫైర్ అయ్యా రు. రాజ్యసభ జీరో అవర్‌లో ఖర్గే మాట్లాడారు. ‘మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం నాపై నిరాధారమైన, సత్యదూరమైన ఆరోపణలు చేశా రు. మా ఎంపీలు అభ్యంతరం తెలపడంతో ఆయన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. కానీ అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. ఎక్కడ చూసినా ఈ ఆరోపణలే కనిపిస్తున్నాయి. ఆయన క్షమాపణలు చెప్పాలి. రాజకీయ దాడు లు, ఆరోపణలకు నేను భయపడను. ఇది నా రాజకీయ జీవితంలో అతిపెద్ద మచ్చ. ఈ ఆరోపణలు ఆ మంత్రి రుజువు చేయాలి. ఆరోపణలు నిజమని తేలితే నేను రాజీనామా చేస్తా. లేకపోతే అతడు రాజీనామా చేయాలి. నా జీవితం తెరిచి న పుస్తకం. ఇటువంటి బెదిరింపులకు నేను భయపడను. నేను ఒక కార్మికుడి కొడుకును.’ అని తెలిపారు. బుధవారం చర్చ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఖర్గే వక్ఫ్ భూములను ఆక్రమించారని ఆరోపించారు.