02-04-2025 04:51:26 PM
నిరసన ర్యాలీ చేపట్టిన రైతులు..
మద్దతు పలికిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, పలువురు నాయకులు...
అక్రమ వసూళ్లు అరికట్టాలని డిమాండ్..
కాగజ్ నగర్ (విజయక్రాంతి): కాగజ్ నగర్ మున్సిపాలిటీ తై బజార్ రద్దు జరిగినప్పటికీ రైతుల వద్ద, కూరగాయలు అమ్మేవారి వద్ద రుసుము వసూలు చేయడాన్ని నిరసిస్తూ రైతులు ర్యాలీ చేపట్టారు. వారికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, భారాస నాయకులు శ్యామ్ రావు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. పురపాలక కమిషనర్ అంజయ్యకు మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ.. తై బజార్ గడువు ముగిసినప్పటికి పాత కాంట్రాక్టర్లు బలవంతంగా రైతుల వద్ద రుసుము వసూలు చేస్తున్నారన్నారు. గతంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ తో మాట్లాడి తై బజార్ రద్దు చేయించానని గుర్తు చేశారు. తై బజార్ ద్వారా మున్సిపల్ కి వచ్చే ఆదాయం 6 లక్షలు మాత్రమే అని దాని కోసం మాములు రైతులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తై బజార్ రద్దు చేసి అక్రమ వసూళ్లను అడ్డుకోవాలని అన్నారు. రైతులకు, విక్రయ దారులకు అండగా నిలవాలని కోరారు.