calender_icon.png 3 April, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.11.20 లక్షలు పలికిన తైబజార్ వేలం

29-03-2025 12:45:39 AM

చేవెళ్ల, మార్చి 28:చేవెళ్ల మున్సిపాలిటీలోని కూరగాయల మార్కెట్ కు సంబంధించిన తై బజార్ వేలం పాట రూ. 11.20 లక్షలు పలికింది. శుక్రవారం మున్సిపల్ ఆఫీస్ లో కమిషనర్ పూర్ణ చందర్ ఆధ్వర్యంలో 202526 కు సంబంధించి బహిరంగ వేలం పాట నిర్వహించగా.

చేవెళ్లకు చెందిన ఏర్పుల జంగయ్య, బేగరి శ్రీనివాస్, ఎం యాదయ్య , శ్రీనివాస్ రెడ్డి పోటీపడ్డారు. ఇందులో బేగరి శ్రీనివాస్ రూ.11.20  లక్షలకు వేలం పాట దక్కించుకున్నారు.  అనంతరం కమిషనర్ మాట్లాడుతూ...  కూరగాయల మార్కెట్లో వివిధ వ్యాపారుల నుంచి  నిర్ణీత రుసుము వసూలు చేసుకునేందుకు ఏడాది పాటు  బేగరి శ్రీనివాస్ కు హక్కు ఉంటుందని తెలిపారు.