22-03-2025 04:28:53 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం బంజపల్లి గ్రామపంచాయతీ తైబజార్ వేలంపాటను రద్దు చేసినట్లు, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి నిజాంసాగర్ తాసిల్దార్ బిక్షపతి శనివారం తెలిపారు. డి ఎల్ పి ఓ ఆదేశాను ప్రకారం ప్రభుత్వం నియమించిన రేటుకు ఎవరు కూడా వేలం పాట పాడకపోవడంతో వేలంపాట రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. తిరిగి ఈనెల 25వ తేదీన వేలం పాట నిర్వహిస్తామని తెలిపారు. ఆసక్తి గలవారు వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.