24-03-2025 10:18:28 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): మండల కేంద్రమైన దౌల్తాబాద్ తైబజార్ వేలంపాట ఈనెల 27న నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండల పంచాయతీ అధికారి సయ్యద్ గఫూర్ ఖాద్రీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయలో ఉదయం 11:30 గంటలకు తైబజార్, పశువుల సంత నిర్వహణ కోసం వేలంపాటలో పాల్గొనేవారు రూ. 10 వేల చొప్పున డిపాజిట్ చేయాలన్నారు. వేలం పాటలో పాల్గొనేవారు గ్రామపంచాయతీకి ఏ విధంగా బకాయిలు ఉండరాదని తెలిపారు.