హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ఈనెల 17 నుంచి లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌తోపాటు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను ఈనెల 21వ తేదీ వరకు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత పొందిన విద్యార్థుల జాబితాను 22న ప్రకటిస్తారు. 23, 24 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. 30వ తేదీన సీట్లను కేటాయిస్తారు. అక్టోబర్ 1 నుంచి 4వ తేదీ వరకు సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.