సీఎస్ శాంతికుమారి
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాం తి): రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 17న ఘనంగా ప్రజాపరిపాలన దినోత్సవం నిర్వహించాలని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో గురువా రం నిర్వహించిన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం రేవం త్‌రెడ్డి పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ పతాకాన్ని ఆవి ష్కరిస్తారన్నారు. పోలీసుల నుంచి గౌరవ వంద నం స్వీకరించిన తర్వాత ప్రసంగిస్తారన్నారు. అధికారులు సభా స్థలంలో మౌలిక సదుపా యాల కల్పించాలని ఆదేశించారు. ఆహ్వానితుల వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఉండాల న్నారు. ట్రాఫిక్ నియంత్రణపై పోలీస్‌శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సమా వేశంలో డీజీపీ జితేందర్, నగర పోలీస్ కమిష నర్ సీవీ ఆనంద్, పలు ప్రభుత్వశాఖల ఉన్న తాధికారులు పాల్గొన్నారు.