calender_icon.png 18 October, 2024 | 3:58 PM

వేదాంత నుంచి 4వ మధ్యంతర డివిడెండ్

26-09-2024 12:02:13 AM

8న బోర్డు సమావేశం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి  ఇన్వెస్టర్లకు మరో బొనాంజా ప్రకటించేందుకు సిద్ధమయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరానికి నాల్గవ మధ్యంతర డివిడెండు ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని, ఆమోదించేందుకు తమ బోర్డు అక్టోబర్ 8న సమావేశమవుతుందని వేదాంత బుధవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది.

సంబంధిత డివిడెండు చెల్లింపునకు అక్టోబర్ 16 రికార్డు తేదీగా నిర్ణయించినట్లు వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకూ వేదాంత మొత్తం రూ. 13,474 కోట్లను డివిడెండుగా ఇన్వెస్టర్లకు పంపిణీ చేసింది. మూడో ఇంటెరిం డివిడెండుగా షేరుకు రూ.20 చొప్పున పంచేందుకు సెప్టెంబర్ 2న బోర్డు ఆమోదం తెలిపింది.

ఈ డివిడెండు రికార్డుతేదీ సెప్టెంబర్ 10. అంతక్రితం జూలైలో షేరుకు రూ.4 చొప్పున జూలైలో, షేరుకు రూ.11 చొప్పున మే నెలలో డివిడెండ్లను చెల్లించింది. వేదాంత లిమిటెడ్‌లో ప్రధాన వాటా కలిగిన మాతృసంస్థ వేదాంత రిసోర్సెస్ చేతికే డివిడెండులో అధిక శాతం వెళుతుంది.