calender_icon.png 26 December, 2024 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీటీఎస్‌ను మరింత విస్తరించాలి

19-10-2024 01:26:46 AM

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 

హైదరాబాద్, అక్టోబర్ 18(విజయక్రాంతి): తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (టీజీటీఎస్) తన పరిధిని మరింత పెంచుకోవాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు. గత ఏడాది రూ.5 కోట్ల లాభం ఆర్జించిన సంస్థ.. ఈ సారి కార్యకలాపాలను పెంచుకొని మరింత ఆదాయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.

టీజీటీఎస్ అనేది ప్రభుత్వ విభాగాలకు కంప్యూటర్ హార్డ్ వేర్, సాఫ్ట్‌వేర్‌లను సరఫరా చేసే నోడల్ ఏజెన్సీ.  సైఫాబాద్ హాకా భవన్‌లో టీజీటీఎస్ పనితీరును శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు సమీక్షించారు. ప్రస్తుతం 44 ప్రభుత్వ విభాగాలకు టీజీటీఎస్ సేవలు అందిస్తోందని మంత్రికి సంస్థ ఎండీ శంకరయ్య వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విభాగాలన్నీ టీజీటీఎస్ ద్వారానే కంప్యూటర్ సంబంధిత పరికరాలు, సాఫ్ట్‌వేర్లను సేకరించుకునేలా చూడాలని ఆదేశించారు. టీజీటీఎస్ ద్వారా తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ పరికరాలు సేకరించవచ్చని చెప్పారు. టీజీటీఎస్ ప్రస్తుతం  ప్రభుత్వ విభాగాలకు కంప్యూటర్ సంబంధిత పరికరాలు, సీసీ కెమెరాలు వివిధ పరికరాలు అందిస్తోంది. మంత్రి వెంట టీజీటీఎస్ చైర్మన్ మ న్నె సతీశ్ కుమార్, ఐటీశాఖ డి ప్యూటీ సెక్రటరీ భవీశ్ మిశ్రా ఉన్నారు.