calender_icon.png 30 September, 2024 | 6:05 PM

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ఆర్టీసీ

04-09-2024 06:33:25 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయణికులకు టీజీఆర్టీసీ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్- తెలంగాణకు రాకపోకలు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో  టీజీ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రయాణికులకు టికెట్ ధరలో 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో 10 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సజ్జనార్ కోరారు. ముందస్తు రిజర్వేషన్ కోసం https://tgsrtcbus.in వెబ్ సైట్ ని సంప్రదించాలని సజ్జనర్ పేర్కొన్నారు.