08-04-2025 06:51:12 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): మంగళ్‌హాట్ డివిజన్‌లో టీజీఎస్పీడీసీఎల్ ఆర్టిజన్ ఉద్యోగి ఏసీబీకి చిక్కారు. టీజీఎస్పీడీసీఎల్(TGSPDCL)లో పనిచేస్తున్న ఆర్టిజన్ అబ్దుల్ రెహమాన్ అనే ఉద్యోగిని తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ACB) మంగళవారం అరెస్టు చేసింది. ధ్వంసమైన విద్యుత్ మీటర్ మార్చేందుకు నుండి రూ.20,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఆ మీటర్ ఫిర్యాదుదారునికి ఎటువంటి జరిమానా లేకుండా సమస్యను నిర్వహించడానికి రెహమాన్ లంచం డిమాండ్ చేశాడు. అయితే ముందు వేసి పతకం ప్రకారంగా మీటర్ బాధితుడు రెహమాన్ కు డబ్బులు అందిస్తుండగా అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. సాయన పరీక్షలో రెహమాన్ రెండు చేతుల వేళ్లు పాజిటివ్‌గా వచ్చింది. తన ప్రజావిధిని సక్రమంగా, నిజాయితీ లేకుండా నిర్వర్తించాడని ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం రెహమాన్‌ను నాంపల్లిలోని ఎసీబీ కేసుల ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత కోర్టు రెహమాన్ కు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.