calender_icon.png 22 December, 2024 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ అరెస్టులపై టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్

22-12-2024 12:49:07 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): దేశంలో సైబర్ నేరాలు అంతకంతకు పెరుగుతుండడంతో టెలికం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కాలర్ ట్యూన్ ద్వారా సైబర్ నేరాలపట్ల అవగాహన కల్పించాలని టెలికం సంస్థలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలపై టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు.  సైబర్ మోసాల్లో చిక్కుకోవడానికి అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమన్నారు. నేరం ఏదైనా సరే 'డిజిటల్ అరెస్ట్' అనేదే ఉండదని, నేరస్తులను నేరుగానే దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేస్తారని సజ్జనార్ తెలిపారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా బెదిరిస్తే అది మోసం అని గుర్తుంచుకోవాలని ప్రజలకు సూచించారు. మన దేశంలోని ఏ దర్యాప్తు సంస్థ కూడా ప్రజల వ్యక్తిగత వివరాలను ఫోన్ ద్వారా అడగదని స్పష్టం చేశారు.

లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు ఫోన్ లేదా ఆన్ లైన్  ద్వారా బెదిరింపులకు పాల్పడితే వారు నకిలీలని అర్థం చేసుకోవాలన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్ కాల్స్ వస్తే మీ సమీపంలోని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని, లేదా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేసి సమాచారం అందించాలని సజ్జనార్ సూచించారు. ఇటీవల నకిలీ డిజిటల్ అరెస్టులు, ఫెడెక్స్ స్కామ్ లు, ప్రభుత్వం, పోలీసు అధికారుగా నటిస్తూ అంతర్జాతీయ స్పూఫ్డ్ కాల్స్ చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.  2024 నవంబర్ 15 వరకు 6.69 లక్షలకు పైగా స్పూఫ్డ్ కాల్స్ సిమ్ కార్డులు, 1,32,000 ఐఎంఈఐలను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది.