12-04-2025 03:05:57 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): యూనియన్ల పేరుతో ఆర్టీసీపై చేస్తోన్న ఆరోపణలపై టీజీఆర్టీసీ యాజమాన్యం శనివారం స్పందించింది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఖండించింది. సంఘాల నేతల ప్రకటనలు ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తున్నాయని, ఎస్ఆర్బీఎస్ ను ఆర్టీసీ సంస్థ రద్దు చేస్తున్నామంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డింది. సంఘాల నేతలమంటూ చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని, పుకార్లని నమ్మి ఆందోళన చెందవద్దని ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెండింగ్ అంశాలను త్వరలోనే పరిష్కారం అవుతాయని, ఎలాంటి గందరగోళానికి గురికావొద్దని స్పష్టం చేసింది.