calender_icon.png 20 April, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

20-04-2025 06:55:45 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా చింతలపాలెం వద్ద టీజీఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఆర్టీసీ బస్సు కోదాడ నుంచి నక్కగూడెం వెళ్తుండగా చింతలపాలెం వద్ద ఓ బైక్ బస్సుకు ఎదురుగా వచ్చింది. బైక్ ను తప్పించబోయ్యే సమయంలో బస్సు స్టీరింగ్ రాడ్ విరగడంతో బస్సు  అదుపుతప్పి బోల్తా పడింది. ఈ  ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. బస్సులో చిక్కుకొని గాయపడిన ప్రయాణికులను చింతలపాలెం యువకులు బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.